
కేరళలో భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గట్లేదన్నారు. కొవిడ్ కట్టడికి లాక్ డౌన్ తప్పట్లేదని స్పష్టం చేశారు. కేరళలో నిన్న ఒక్క రోజే 42 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.