
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హౌస్ బిల్డింగ్ లోన్ లో అవకతవకలకు పాల్పడ్డారని 49 మందికి షోకాజ్ నోటీసులివ్వగా ఇంతమంది ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం టీటీడీలో తొలిసారి. నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగులు ఉండగా.. మరికొంత మంది ఉద్యోగులకూ నోటీసులు జారీ చేసే అవకాశముంది. కాగా ఇటీవలే ఆర్జిత సేవా టికెట్ల స్కాంలో ఏడుగురు ఉద్యోగులను టీటీడీ డిస్మిస్ చేసింది.