
కొవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కొరడా ఝళిపిస్తున్నది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్యశాలల లైసెన్స్ లను రద్దు చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నది. తాజాగా రాష్ట్రంలో ఇవాళ మరో ఆరు దవాఖానల లైసెన్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ హైదరాబాద్ నగర పరిధిలోనివే. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 113 దవాఖానలకు వైద్య ఆరోగ్య శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.