Anam Venkataramana Reddy Comments On Roja: ఇటీవల తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళా నేత, మాజీమంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడుతున్నారు. మొన్న ఆ మధ్యన నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గట్టి వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్స్ పై రోజా స్పందించారు. ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం పై కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రత్యేకంగా ఒక వీడియో సైతం విడుదల చేశారు. అయితే రోజా విషయంలో పెద్దగా సానుభూతి లభించలేదు. గతంలో ఆమె వ్యవహరించిన తీరు చూసి.. చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే ఇంతలో గాలి నా కొడుకులు.. గాలిలో గెలిచారు అంటూ రోజా కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోసారి ఆమె కూటమి పార్టీలకు టార్గెట్ అయ్యారు.
Also Read: సాయి రెడ్డిని పిలవాలా? వద్దా?.. కన్ఫ్యూజన్ లో జగన్!
ఆమెపై గౌరవం ఉందంటూనే..
తాజాగా మాజీ మంత్రి రోజా ( RK Roja) వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తమకు మహిళా నేతగా రోజా అంటే గౌరవం ఉందని.. అందుకే రోజక్కా అంటూ గౌరవంగా పిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ గాలి నా కొడుకులు.. గాలికి గెలిచారంటూ ఆమె మాట్లాడిందని ఫైర్ అయ్యారు. అదే స్థాయిలో తాము వ్యాఖ్యానాలు చేస్తే ఎలా ఉంటుందోనని చెప్పుకొచ్చారు. గాలి ముండలు.. గాలి లేక ఓడిపోయారని తాను అంటే బాగుంటుందా? అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడితే అసహ్యంగా ఉంటుందన్నారు. అందుకే మాట్లాడిన తీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే ఇటువంటి వ్యాఖ్యానాలే వస్తాయని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే భాను ప్రస్తావన తెస్తూ..
నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ ( Gali Bhanu Prakash ) విషయంలో రోజా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు ఆనం వెంకటరమణారెడ్డి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి భాను ప్రకాష్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీలా పార్టీలు మారి.. ప్రాంతాలు మారి వచ్చిన వ్యక్తి భాను ప్రకాష్ కాదని వెంకట రమణారెడ్డి హితవు పలికారు. అయితే ఆది నుంచి రోజా విషయంలో సెటైరికల్ గా మాట్లాడేది ఆనం వెంకటరమణారెడ్డి. గత కొంతకాలంగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నారు ఆయన. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి రోజాను టార్గెట్ చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం ఆనం వెంకటరమణారెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోజా గాలి ముం* మాటలు మాట్లాడకు
వైసీపీ మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి pic.twitter.com/5anS6Pw0rq
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2025