
కరోనాతో సతమతమవుతున్న భారత్ కు అగ్రరాజ్యం మరోసారి భారీ సాయం ప్రకటించింది. భవిష్యత్ లో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ కు 41 మిలియన్ డాలర్లు రూ. 304 కోట్ల సాయం చేయనున్నట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెల్లడించింది. ఈ 41 మిలియన్లతో కలిపి భారత్ కు అందే మొత్తం సాయం 200 మిలియన్ డాలర్లు దాటుతుందని యూఎస్ఏఐడీ పేర్కొంది.