వారిలో లేని అభిమానాన్ని చాటి తన భక్తిని చాటుతున్నారు. ఖైరతాబాద్ క్రాస్ రోడ్డులో ఇందిరాగాంధీ కంటే పెద్ద విగ్రహాన్ని నెలకొల్పి తనలోని స్వామిభక్తిని బయటపెట్టారు. పీవీ శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పీవీ పేరును ఎప్పుడో మరిచిపోయారు. సొంత పార్టీ వారే పట్టించుకోని కాలంలో తెలంగాణ నాయకుడిగా సేవలు ప్రశంసిస్తూ ఆయనకు ఘన కీర్తిని తెచ్చిపెడుతున్నారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం పెదవి విప్పడం లేదు. దేశానికి ఆర్థిక సూత్రాలు ప్రవేశపెట్టి ముందుకు నడిపించిన పీవీని గురించి ఎవరు పట్టించుకోకున్నా కేసీఆర్ మాత్రం తనలోని భక్తిని ఎప్పటికప్పుడు చాటుతున్నారు. కేసీఆర్ ఏదైనా అనుకుంటే దాన్నికచ్చితంగా అమలు చేస్తారు. నిశ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ కాంగ్రెస్ నుంచి తమ సొంతం చేసుకునేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలతో అర్థం అవుతోంది. పీవీ నర్సింహారావును కాంగ్రెస్ ఎప్పుడో మరిచిపోయింది. ఆయన సేవలను సైతం గుర్తించడం లేదు.
దేశానికి చూపిన మార్గాలు సైతం పక్కన పెట్టేశారు. అంతా అధిష్టానం చెప్పుచేతల్లో ఉంటూ వారి కనుసన్నల్లోనే నడుస్తున్నారు. దేశానికి ప్రధానిగా చేసినా ఆయనకు తగిన గుర్తింపు ఇక్కడ లభించలేదు. కనీసం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా పీవీకి లేదంటే అతిశయోక్తి కాదు.ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో అసలు పీవీ కాంగ్రెస్ నేత కాదనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి.