
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియామావళి ప్రకారం సభా వ్యవహారాలను సాగించనున్నారు.