messi plain : అర్జెంటినా ఫుట్ బాల్ జట్టు లో ఆడే మెస్సి.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామం లో పుట్టిన అతడు అంచలంచలుగా ఎదిగి.. ఈ రోజున ప్రపంచం మొత్తం తన వైపు చూసే విధంగా రూపాంతరం చెందాడు. ప్రపంచంలో ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో మెస్సి మొదటి వరుసలో ఉంటాడు. ఫుట్ బాల్ ద్వారా ఎంతో డబ్బు సంపాదించిన అతడు.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
మెస్సి అద్భుతమైన ఆటగాడు కాబట్టే కోల్ కతా లాంటి ప్రాంతంలో అతడికి 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ ఆవిష్కరించాడు. అతడిని ప్రత్యక్షంగా చూసేందుకు సాల్ట్ లేక్ స్టేడియంలోకి వేలాది మంది వచ్చారంటే.. మెస్సీ మానియా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
మెస్సి కి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీవీవీవీఐపీ కేటగిరిలో ఉండే మెస్సి.. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు సాధారణ విమానాలలో ప్రయాణించడు. భద్రతా కారణాల వల్ల అతడు ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తుంటాడు. అత్యంత అధునాతనమైన సదుపాయాలు ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ వి ( జీవీ) విమానంలో మెస్సి ప్రయాణిస్తుంటాడు. ఇది పూర్తిగా బిజినెస్ జెట్. “గల్ఫ్ స్ట్రీమ్ వి” బిజినెస్ జెట్ ను అమెరికా కు చెందిన కంపెనీ ఈ విమానాన్ని తయారు చేసింది. ఈ విమానం 25.83 అడుగుల ఎత్తు ఉంటుంది. 96.42 అడుగుల పొడవు ఉంటుంది. ఇది గంటకు 940 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఏకధాటిగా 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
న్యూయార్క్ నుంచి టోక్యో, లండన్ నుంచి సింగపూర్ ప్రాంతానికి దూసుకుపోతుందన్నమాట. 51 వేల అడుగుల ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది. సాధారణ విమానాలు 31 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తుంటాయి. అందువల్లే మెస్సి ప్రయాణిస్తున్న జెట్ కు ఎటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఈ జెట్ లో ఏకంగా 16 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీని ఖరీదు 362 కోట్లపై మాట.. నిర్వహణ ఖర్చు కింద 36 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ విమానం గంట దాదాపు పది లక్షల వరకు ఉంటుంది.