Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు ఆయన సాధించిన విజయాలకు పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలను అందిస్తున్నాడు. ఇక ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో ఇకమీదట చేయబోతున్న సినిమాలకు అంతే డిమాండ్ ఉంది. నిజానికి ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తున్నాడు…మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు మాస్ కమర్షియల్ సినిమాలకు కొత్త అర్ధాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన తన గ్రేస్ ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఇండస్ట్రీ కి తిరిగి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తర్వాత ఆయన అందుకున్న సక్సెస్ లు చాలా తక్కువనే చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి సోలో హీరోగా వస్తే పెద్దగా సక్సెస్ సాధించడం లేదనే భయం తనకి పట్టుకుందా.?
అందుకే మరొక హీరోను అతని సినిమాలో భాగం చేసుకుంటున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజను భాగం చేసిన ఆయన ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ లో ఒక్కడే సోలోగా వచ్చాడు ఆ మూవీ సరిగ్గా ఆడలేదు. దాంతో చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ ని భాగం చేస్తున్నాడట.
ఇక అనిల్ రావిపూడి ముందు ఈ కథను చిరంజీవి కోసం రాసినప్పటికి ఒక సీక్వెన్స్ లో వేరే హీరో ఉంటే బాగుంటుందని అది వెంకటేష్ అయితే ఇంకా బాగుంటుందని చిరంజీవి సలహా ఇవ్వడంతో అనిల్ రావిపూడి ఓకే చెప్పి దానికి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేశాడట. ఇక మొత్తానికైతే వెంకటేష్ ను ఈ సినిమాలో భాగం చేశారు.
చిరంజీవి ఎందుకని ఇతర హీరోలను తన సినిమాలో భాగం చేయాలనుకుంటున్నాడు. తను సోలోగా వస్తే సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు అనే ఒక డైలమాలో ఉన్నాడా? లేదంటే తనతో పాటు మరొక హీరో యాడ్ అయితే సినిమా రేంజ్ పెరుగుతోందని భావిస్తున్నాడా..? చిరంజీవి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…