Avatar 3 10 Days World Wide Collections : ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కెమరూన్(James Cameron) తెరకెక్కించిన ‘అవతార్’ సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విదేశాలతో పాటు, మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియా లోని అన్ని భాషల్లో కూడా ఈ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ‘అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్’ చిత్రం అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండవ పార్ట్ కి టాక్ మాత్రం పాజిటివ్ గా రాలేదు. డివైడ్ టాక్ వచ్చింది, దీంతో ‘అవతార్ 3: ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) చిత్రానికి అనుకున్నంత స్థాయిలో క్రేజ్, హైప్ రాలేదు. సినిమా విడుదలయ్యాక టాక్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది. రెండవ భాగం కంటే మూడవ భాగమే బాగుందని ప్రతీ ఒక్కరు అన్నారు, కానీ కలెక్షన్స్ మాత్రం లేవు. 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా దేశాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం.
నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 217.7 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గత రెండు అవతార్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. చైనా దేశం లో ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండేది. అక్కడ ఓపెనింగ్స్ భారీ గా వచ్చాయి కానీ, లాంగ్ రన్ మాత్రం అనుకున్నంతగా రావడం లేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చైనా లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 99.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఫ్రాన్స్ దేశం నుండి 54.4 మిలియన్ డాలర్లు,జర్మనీ నుండి 43.1 మిలియన్ డాలర్లు, కొరియా నుండి 32.1 మిలియన్ డాలర్లు, యునైటెడ్ కింగ్డమ్ నుండి 27.7 మిలియన్ డాలర్లు , మెక్సికో నుండి 22.3 మిలియన్ డాలర్లు, ఇండియా నుండి 18.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా స్పెయిన్ దేశం నుండి 18.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఇటలీ నుండి 17.7 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియా నుండి 17.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక అన్ని దేశాలకంటే తక్కువగా ఇండోనేషియా లో 12.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, బ్రెజిల్ దేశం నుండి 10.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో 760 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది భారీ వసూళ్లే అయినప్పటికీ అవతార్ ఫ్రాంచైజ్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాలి. జనవరి 1 లోపు ఈ మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఊపు చేస్తుంటే జనవరి 3 వరకు అయ్యేలా ఉంది. అంతే కాకుండా అవతార్ మొదటి భాగానికి దాదాపుగా మూడు బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తే, అవతార్ 2 కి కేవలం 2.2 బిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. కానీ ‘అవతార్ 3’ కి ఇప్పుడు కనీసం 1.6 బిలియన్ డాలర్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు.