Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : లెనిన్ విజయంతో టాప్ డైరెక్టర్ తో సినిమాను సెట్ చేసుకున్న అఖిల్...

Lenin Movie : లెనిన్ విజయంతో టాప్ డైరెక్టర్ తో సినిమాను సెట్ చేసుకున్న అఖిల్…

Lenin Movie : గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఎట్టకేలకు ‘లెనిన్’ సినిమాతో మంచి విజయం దక్కింది. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక్క సక్సెస్ వస్తే చాలు చాలా మంది స్టార్ డైరెక్టర్లు అతనితో సినిమా చేద్దామని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అఖిల్ తో కొరటాల […]

Lenin Movie : గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఎట్టకేలకు ‘లెనిన్’ సినిమాతో మంచి విజయం దక్కింది. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక్క సక్సెస్ వస్తే చాలు చాలా మంది స్టార్ డైరెక్టర్లు అతనితో సినిమా చేద్దామని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అఖిల్ తో కొరటాల శివ సైతం ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య బాబుతో ఆయన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అఖిల్ తో సినిమా చేయడానికి కసరతులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిలబెట్టే విధంగా ఉండాలి. కానీ తన ఇమేజ్ ను డౌన్ చేసే విధంగా ఉండకూడదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తే మంచిదని మరికొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు.

కొరటాల శివ సినిమా అంటే మినిమం గ్యారంటి మూవీ గా ఉంటుంది. కాబట్టి అతనితో సినిమా చేయడం వల్ల అఖిల్ ఇమేజ్ తారా స్థాయికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో సరైన క్లారిటి అయితే లేదు. ఇక ఈ గ్యాప్ లో అఖిల్ మరో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ భారీ విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక రేంజ్ ను మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళితేనే అఖిల్ టాప్ హీరోగా మారుతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా తన తోటి హీరోలందరు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి అఖిల్ కూడా వాళ్ళకి పోటీ ని ఇస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper