
ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. ఎయిర్ పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్లు,( భారత కరెన్సీలో దాదాపు రూ. 3 వేలు)కు చేరింది. ఒక ప్లేట్ రైస్ కు వంద డాటర్లు (రూ. 7500) ఖర్చు చేయాల్సిన దుస్థితి ఎదురైంది. మరో వైపు ఆఫ్ఘన్ కరెన్సీని విమానాశ్రయంలో తీసుకోవడం లేదు. కేవలం డాలర్లు మాత్రమే అనుమతి ఇస్తుండడంతో ఆప్ఘన్ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.