https://oktelugu.com/

Jagan Shimla Tour: సీఎం జగన్ హాలీడే టూర్ ఎక్కడికి? ఎందుకంటే?

Jagan Shimla Tour:  ప్రతి మనిషి ఉదయం లేవగానే ఆఫీసు పనులు.. ఇంటి పనులు.. ఇతరత్రా బయటి పనులతో వారమంతా బిజీ బిజీగా గడిపేస్తారు. కొంతమందికి హాలీడేస్ అయిన ఆదివారం కూడా సెలవుండదు.. గొడ్డు చాకిరీ చేయాల్సిందే. అయితే సామాన్యులకే ఈ పరిస్థితి ఉంటే ఇక సెలబ్రెటీల సంగతి చెప్పక్కర్లేదు. వారు పడుకునే సమయం తప్పా మిగతా అంతా బీజీనే.. ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చాక విదేశీ పర్యటనలకు వెళ్లింది రెండంటే రెండు సార్లే.. సీఎంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2021 / 11:47 AM IST
    Follow us on

    Jagan Shimla Tour:  ప్రతి మనిషి ఉదయం లేవగానే ఆఫీసు పనులు.. ఇంటి పనులు.. ఇతరత్రా బయటి పనులతో వారమంతా బిజీ బిజీగా గడిపేస్తారు. కొంతమందికి హాలీడేస్ అయిన ఆదివారం కూడా సెలవుండదు.. గొడ్డు చాకిరీ చేయాల్సిందే. అయితే సామాన్యులకే ఈ పరిస్థితి ఉంటే ఇక సెలబ్రెటీల సంగతి చెప్పక్కర్లేదు. వారు పడుకునే సమయం తప్పా మిగతా అంతా బీజీనే..

    ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చాక విదేశీ పర్యటనలకు వెళ్లింది రెండంటే రెండు సార్లే.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారి జెరూసలెం వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో గెలిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లారు. మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. చిన్న కుమార్తెను అమెరికాలోని కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లారు. ఈ రెండూ వ్యక్తిగత పర్యటనలే.. అమెరికా వెళ్లినప్పుడు మాత్రం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటనలకు ఎప్పుడూ వెళ్లలేదు.

    పెట్టుబడుల కోసం గతంలో ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా కూడా వెళ్లారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత కరోనా కారణంగా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆయన పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేయలేకపోయారు.

    కానీ తాజాగా సీఎం జగన్ కుటుంబంతో కలిసి హాలీడే ప్లాన్ చేశారు. ఈనెల 26వ తేదీ గురువారం నుంచి ఐదురోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వెళుతున్నారు. ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వ్యక్తిగత పర్యటన కావడంతో అధికారవర్గాలు చెప్పడం లేదు.

    ఆగస్టు 28వ తేదీన సీఎం జగన్-భారతీల 25వ వివాహ వార్షికోత్సవం, పెళ్లి అయ్యి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఆ ముఖ్యమైన క్షణాల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబం అంతా కలిసి టూర్ కు వెళుతున్నారు. అయితే సీఎం జగన్ ఫారిన్ టూర్ ప్లాన్ చేసినా దేశం దాటి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం హోదాలో వచ్చే డిప్లమాటిక్ పాస్ పోర్టు ఉన్నప్పటికీ సీబీఐ కేసుల దృష్ట్యా విదేశాలకు వెళితే పర్మిషన్ తీసుకోవాలి. అందుకే దేశంలోనే టూర్ ను జగన్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సిమ్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు.