Homeఆంధ్రప్రదేశ్‌Family : అన్న కోటిన్నర అప్పు.. తల్లిదండ్రులు, తమ్ముడు ఆత్మహత్య

Family : అన్న కోటిన్నర అప్పు.. తల్లిదండ్రులు, తమ్ముడు ఆత్మహత్య

family commits suicide due to debtsFamily : అప్పు జీవితానికి ముప్పు అంటారు. అప్పు దొరికింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అందట తల్లి. అప్పు చేస్తే అది మనకు కునుకు లేకుండా చేస్తుంది. తీరే వరకు వేధిస్తోంది. కానీ ప్రస్తుతం అప్పుకు ఎవరు భయపడడం లేదు. ఏమంటే దేశమే లక్షల కోట్లు అప్పు చేస్తుంది కదా అని సమర్థించుకుంటారు. ఓ సినిమాలో అప్పు చేయని వాడు గాడిద అంటాడు కథానాయకుడు. కానీ అప్పుతో ఎప్పటికైనా ముప్పే. బాధ్యతలు మరిచిన వారే అప్పులు చేస్తారని అంటారు. కానీ ప్రస్తుత ప్రపంచంలో అప్పు చేయని వాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.

అది కుటుంబ నిర్వహణ కోసమైనా భూమి కోసమైనా దేనికైనా అప్పు చేయక తప్పడం లేదు. అప్పు నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదని తెలుస్తోంది. అప్పుల బాధతో ఓ కుటుంబంలో (Famiyl) ముగ్గురు ఆత్మహత్యకు (Suicide) పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా (Chittoor) పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా శంకరయ్య కుటుంబం నివాసం ఉంటోంది. వారి పెద్ద కుమారుడు సతీష్ తనకు ఉన్న పరిచయస్తుల నుంచి సుమారు రూ.కోటిన్నర వరకు అప్పు చేశాడు. జల్సాలకు అలవాటు పడి అందినకాడల్లా అప్పు చేశాడు.

ఈ నేపథ్యంలో అప్పుల బాధలు పెరిగిపోయాయి. బాధితులు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు. అప్పు తిరిగి ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో అప్పు చేసిన సతీష్ ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కలత చెందిన కుటుంబ యజమాని శంకరయ్య, కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేశారు. సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇక అప్పు ఎవరు తీరుస్తారని వారిలో వారే మథనపడిపోయారు. దీనికి పరిష్కారం ఏమిటని తపన పడ్డారు.

చివరకు తనువులు చాలించడమే సరైన మార్గమని భావించి భార్య గురువమ్మ(50), చిన్న కుమారుడు వినయ్ (25) అందరు కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలి కావడమంటే ఇదే. తాత్కాలిక ఆనందం కోసం అందినకాడల్లా అప్పు చేసి కుటుంబాన్ని నాశనం చేసిన సతీష్ కోసం అన్వేషిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version