
కరోనా కల్లోలం పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి శనివారం ఓ వీడియో సందేశం పంపించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మేలుకుని, తమ కర్తవ్యాలను నిర్వహించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. కరోనా వ్యాక్సిన్లను ప్రజందరికీ ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.