
గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానది తీరంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గుంటూరు ఎస్పీ అరీఫ్ ఇవాళ మీడియా ఎదుట హాజరు పర్చారు. ఎస్పీ ఆరీఫ్ మీడియాతో మాట్లాడుతూ నిందితుల అరెస్టు కోసం పోలీసులు చాలా కష్టపడ్డారు. కృష్ణ కిశోర్ ను విజయవాడ రైల్వే ట్రాక్ పై పట్టుకున్నాం. అత్యాచార ఘటనకు ముందు నిందితులు ఒక వ్యక్తిని హత్య చేశారు. మా విచారణలో కృష్ణ కిశోర్ హత్య విషయం అంగీకరించాడని తెలిపారు. హత్య తర్వాత కృష్ణా నది తీరంలో ఉన్న జంటను చూశారు. నదీ తీరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు.