https://oktelugu.com/

అందరు హీరోలకు మించి.. ప్రభాస్ కు అన్ని వేల కోట్ల ఆస్తి?

తెలుగు పరిశ్రమలో కథానాయకులు రూ. వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న వారే. అందులో ప్రభాస్ మాత్రం ఇంకా ఎక్కువ ఆస్తులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు రూ.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసిందే. ఈ సినిమాతో తెలుగునాట కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు పెరిగారు. బాహుబలితో ప్రభాస్ క్రేజీ పెరిగి అందనంత ఎత్తుకు ఎదిగినట్లు తెలుస్తోంది. కానీ తరువాత వచ్చిన సాహో సినిమా నిరుత్సాహపరిచింది. సినిమా ప్లాప్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 7, 2021 / 07:22 PM IST
    Follow us on

    తెలుగు పరిశ్రమలో కథానాయకులు రూ. వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న వారే. అందులో ప్రభాస్ మాత్రం ఇంకా ఎక్కువ ఆస్తులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు రూ.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసిందే. ఈ సినిమాతో తెలుగునాట కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు పెరిగారు. బాహుబలితో ప్రభాస్ క్రేజీ పెరిగి అందనంత ఎత్తుకు ఎదిగినట్లు తెలుస్తోంది. కానీ తరువాత వచ్చిన సాహో సినిమా నిరుత్సాహపరిచింది. సినిమా ప్లాప్ అయినా రూ.400 కోట్లు వసూలు చేసి ప్రభాస్ రేంజ్ ఇంకా పెంచింది.

    అయితే సినిమాల పరంగా కాకుండా ప్రభాస్ కు ఇంతకుముందే ఆస్తులు ఉన్నట్లు తెలిసిందే. ఆయన పెదనాన్న, తండ్రి కలిసి గోపికృష్ణా మూవీస్ అనే బ్యానర్ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి లాభాలు గడించారు. దీంతో పలు వ్యాపారాలు సైతం నిర్వహించేవారు. వారికి గ్రానైట్ కంపెనీ సైతం ఉంది. ఫాం హౌస్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, వ్యవసాయ ఆధారిత తోటలు, పొలాలు ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో వారి ఆస్తి దాదాపు రూ.7 వేల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.

    ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇది 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు ధరిస్తున్నట్లు తెలిసిందే. మరో వైపు ఓం రౌత్ దర్శత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామచంద్రుడి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. సగానికి పైగా పూర్తయింది.

    తరువాత అశ్వనీదత్ నిర్మించే వైజయంతి మూవీస్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ తోపాటు నాని, విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ సహజంగానే కోటీశ్వరుడు అని తెలుస్తోంది.

    తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది కథానాయకులు కోటీశ్వరులున్నారు. అందరు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటుండంతో సహజంగానే వారి సంపద పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి ఆస్తులు సైతం రూ. వేల కోట్లలోనే ఉంటున్నట్లు సమాచారం. అందులో అందరి కంటే ప్రభాస్ ఆస్తి మాత్రం ఎక్కువే అని చెబుతున్నారు. ఇంత మొత్తంలో ఆస్తులు ఉండడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.