Telugu News » Ap » Accident at thirumala ghat one killed
Accident: తిరుమల ఘాట్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకొనేందుకు మరో మూడు కి.మీల దూరంలో ఉండగా జరిగిన ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.