అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ఓ యువకుడు నృత్యం చేస్తూ ఉన్నట్లుండి కూప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.