PM Narendra Modi: ప్రస్తుతం అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోడీ వైపే నిలుస్తారని తెలుస్తోంది. సర్వేలన్ని ఇదే విషయాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ చరిష్మా తగ్గలేదనే తెలుస్తోంది. కొన్ని సర్వేలు మాత్రం బీజేపీకి అంత సీన్ లేదని చెబుతున్నా మెజార్టీ సర్వేలు మాత్రం బీజేపీదే విజయం అని తేల్చుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ తన ప్రభావాన్ని మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నా అవి దారికి రావడం లేదు. విపక్షాలపై వ్యతిరేకత బీజేపీకి బలం చేకూర్చేవిగా ఉంటున్నాయని సమాచారం.
ఉత్తరప్రదేశ్ లో ఏబీపీ సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 485 అసెంబ్లీ స్థానాల్లో సర్వే నిర్వహించగా 42 శాతం ప్రజలు బీజేపీకే అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ 267 స్థానాలు గెలుచుకుంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రజాబలం కోల్పోకుండా బీజేపీ తన శాయిశక్తులా ప్రయత్నాలు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే బీజేపీ ఇక్కడ 248 స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సాధ్యమవుతుందని తెలిసిందే. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో బీజేపీకే మెరుగైన అవకాశాలు కలుగుతాయని ఆశిస్తున్నారు. దీంతో బీజేపీ తన ప్రతిష్ట పెంచుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
బీఎస్పీ అధినేత మాయావతి కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని ఆశించినా ఆమె వైపు ఓటర్లు మొగ్గు చూపడం లేదు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఆమెకు కేవలం 16 శాతం ప్రజలు మద్దతు పలికినట్లు ఫలితాలు వె ల్లడిస్తున్నాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. కేవలం 5 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా బీజేపీకి అధికారం దూరం చేయలేవేమోనని తెలుస్తోంది.