
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆయన పై కేసు నమోదైంది. 188, 269, 270 రెడ్ విత్ 34 ఐసీసీ సెక్షన్లతో పాటు ఎపిడమిక్ చట్టం కింద నరేంద్రపై కేసులు నమోదు చేశారు.