
అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్ర్బాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీని వెనక దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్ సింగ్ తెలిపారు.