Health Benefits of Tamarind: మన దేశంలోని వంటకాలలో ఎక్కువగా వినియోగించే వాటిలో చింతపండు ఒకటనే సంగతి తెలిసిందే. పులిహోరలో లేదా సాంబార్ లో కూడా చింతపండును వినియోగించడం జరుగుతుంది. చింతపండు వల్ల వంటలకు రుచి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చింతపండులో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.
విటమిన్ సీ, ఇ, బీ, ఐరన్, భాస్వరం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, కాల్షియం చింతపండులో ఎక్కువగా ఉంటాయి. రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో చింతపండు తోడ్పడుతుంది. చింతపండు కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధించడంతో పాటు డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చింతపండులో హైడ్రోసిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. హైడ్రోసిట్రిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొవ్వును తగ్గించడంతో పాటు అతిగా తినే అలవాటును వదిలిస్తుంది.
ఐరన్, పొటాషియం చింతపండులో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలను తయారు చేయడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో చింతపండు తోడ్పడుతుంది. ఆక్సీకరణ నష్టం, వ్యాధి నుండి గుండెను రక్షించే భాగాలు చింతపండులో ఉండటం గమనార్హం. శరీరానికి అవసరమైన మెగ్నీషియం చింతపండులో ఉండటంతో పాటు శరీరంలోని 600 పనులను నెరవేర్చడానికి చింతపండు తోడ్పడుతుంది.
వాపు మొదలైన సమస్యలకు చింతపండు తినడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. మధుమేహంను నియంత్రించడంలో కూడా చింతపండు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.