
తెలంగాణ హెల్త్ బులిటెన్ ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 46 మంతి మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 4.81 లక్షల కరోనా కేసులు నమోదవగా 2,625 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 73,851 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1104 కరోనా కేసులు నమోదవగా రంగారెడ్డి 443, మేడ్చల్ 378 నల్గొండ జిల్ాలలో 323 కేసులు, వరంగల్ అర్జన్ 321, కరీంనగర్ జిల్లాలో 263 కరోనా కేసులు, నాగర్ కర్నూలు 204, సిద్ది పేట 201 కేసులు నమోదయ్యాయి.