
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. రోజువారీ కేసులు, మరణాల్లో మాత్రం స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 19,07,216 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 43,733 మందికి పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 26 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,06,63,655కి చేరాయి. గడిచిన 34 గంటల్లో 930 మంది మరణించారు.