
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా మరోసారి రెండు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వం శాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది.