అయ్యో కరోనా విలయతాండవం మాజీ హీరోయిన్ కి భర్తను లేకుండా చేసింది. హీరోయిన్ మాలాశ్రీ భర్త కుణిగల్ రామును కరోనా మింగేసింది. సినీ నిర్మాతగా, మాలాశ్రీ భర్తగా కుణిగల్ రాము (52) కన్నడ సినీ పరిశ్రమలో కీలక పాత్రను పోషించారు. అలాంటి వ్యక్తి కరోనాతో మరణించడం కన్నడ పరిశ్రమని షాక్ కి గురి చేసింది. గత మూడు రోజులగా కరోనాతో పోరాడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
రాముకి గత వారం లైట్ జ్వరం వచ్చి ఇబ్బంది పెట్టింది. ఆయన మొదట దాన్ని పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ అనారోగ్యంగా ఉండటంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా కోవిడ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయనకు శుక్రవారం నాడు బాగా సీరియస్ అయింది, వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి చెక్ చేసి.. బాలేకపోవడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
మొదట్లో వైద్యానికి కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చివరకు ఆయన నిన్న సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. సినీ నిర్మాతగా రాముకు మంచి పేరు ఉంది. ఆయన ఎప్పుడు నటీనటులకు మంచి గౌరవం ఇస్తారని.. అందుకే ఆయన నిర్మాణంలో పని చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారని.. ఆయన లేని లోటును ఎవ్వరూ తీర్చలేరని కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఇక కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చున్న రాము ఏకే 47, లాకప్ డెత్, కలాసిపాళ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి సక్సెఫుల్ నిర్మాతగా కన్నడలో పేరుతెచ్చున్నారు. అలాగే ఆయన సతీమణి మాలాశ్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఆమె భర్త రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున రాము మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.