Homeజాతీయం - అంతర్జాతీయంపద్మానదిలో బోటు తిరగబడి 26 మంది మృతి

పద్మానదిలో బోటు తిరగబడి 26 మంది మృతి

బంగ్లాదేశ్ లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళ్తున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మదారిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళ్తున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటీకీ వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular