Homeఅంతర్జాతీయంIsrael secret weapon global threat: ప్రపంచాన్ని నాశనం చేసే ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్.. ఎంత...

Israel secret weapon global threat: ప్రపంచాన్ని నాశనం చేసే ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్.. ఎంత డేంజర్ అంటే?

Israel secret weapon global threat: మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం పెను విపత్తులకు దారితీసాయి. ఈ యుద్ధాలు ప్రపంచం మొత్తాన్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టాయి. వీటి నుంచి కోలుకోవడానికి ప్రపంచానికి చాలా సమయం పట్టింది. మధ్య మధ్యలో యుద్ధాలు వచ్చినప్పటికీ ప్రపంచ యుద్ధాల స్థాయిలో మాత్రం అవి జరగలేదు.

ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండడం.. అవి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ మీద స్థాయికి మించి దాడులు చేసింది. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉంది. కేవలం ఇరాన్ మీద మాత్రమే కాకుండా.. ఆ దేశానికి సహకరించే అనేక ముఠాలపై ఇజ్రాయిల్ గురి పెట్టింది.ఇక ఇరాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్ అంత సులభమైనది కాదు.

ఈ న్యూక్లియర్ వెపన్ ను ఇజ్రాయిల్ ఉపయోగిస్తే ఆఫ్రికా నుంచి అమెరికా వరకు దాదాపు 80 శాతం దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ బాంబు పేరు జెరికో 111. ఈ బాంబు వల్ల కెనడా, యునైటెడ్ స్టేట్స్, గ్రీన్ ల్యాండ్, వెనిజులా, బ్రెజిల్, అంగోల, నమిబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదలు పెడితే జపాన్ వరకు అన్ని దేశాలు తీవ్రంగా నాశనం అవుతాయి. కేవలం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (కొంత భాగం), పపూవ న్యూగీనియా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, సదరన్ మహాసముద్రం, అంటార్కిటికా ఖండం, నార్త్ పసిఫిక్ మహాసముద్రం మాత్రమే ఈ బాంబు బారి నుంచి తప్పించుకుంటాయని తెలుస్తోంది.

Also Read: బెడిసి కొడుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ వ్యూహాలు.. ఇరాన్‌లో పెరుగుతున్న ఐక్యత!

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా విసిరిన న్యూక్లియర్ బాంబు వల్ల జపాన్ సర్వనాశనమైంది. ఆ దేశం కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ అమెరికా న్యూక్లియర్ బాంబు విసిరినచోట కనీసం పచ్చగడ్డి కూడా మొలకెత్తు లేదంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు . ఇరాన్ ప్రతిదాడులకు దిగడం.. దానికి ఉగ్రవాదుల గ్రూపులు సహకరించడంతో ఇజ్రాయిల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా దాడులు చేపట్టే విషయంలో దూకుడు తనాన్ని ప్రదర్శిస్తోంది. ఆదేశం వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇరాన్ చర్చలకు వస్తా ఉందని అమెరికా చెబుతున్నప్పటికీ.. అది వాస్తవం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఇరాన్ చాలా వరకు నష్టపోయింది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాలు కూడా నష్టపోయాయి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular