
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్కోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ భేటీలో కరోనా నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల, ఆసుపత్రులలో పడకల పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమెడిసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 18నుంచి 45 సంవత్సరాలు మధ్య వారిని వ్యాక్సినేషన్ కోసం నిధులు కేటాయింపునకు కేటినెట్ ఆమోదం తెలుపనుంది. ప్రభుత్వం అతిథి గృహలను పర్యటక శాక ద్వారా నిర్మించే అంశంపైనా కేటినెట్ లో చర్చ జరుగనుంది.