
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2.4 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.