సినిమా ఇండస్ట్రీలో బతికే ప్రతి ఒక్కడికి డైరెక్టర్ అయిపోవాలనే ఆశ ఉంటుంది. నిర్మాతలను ముంచడానికి కాకపోతే.. ‘జబర్దస్థ్’ కమెడియన్ కూడా డైరెక్టర్ అయిపోవాలని అనుకోవడం ఏమిటి ? ఏకంగా తన సినిమాని ఓపెనింగ్ కూడా చేయడం ఏమిటి ? అతనితో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ఆ నిర్మాత దౌర్భాగ్యం కాకపోతే.
అయినా డైరెక్షన్ చేయడమనేది తన చిరకాల వాంఛ అని, అందుకే డైరెక్టర్ కావాలనే ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి జీవితంలో చాల త్యాగం చేశానని ఆ కమెడియన్ పెద్ద పెద్ద డైలాగ్సే చెప్పాడు తన సినిమా లాంచింగ్ రోజు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరయ్యా అంటే.. జబర్దస్థ్ ఫేమ్ ‘కిరాక్ ఆర్పీ’. ఇతగాడు నటుడు కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
కాలం కలిసి రాక, రోజులు గడవక కామెడీ చేయడానికి నానాకష్టాలు పడ్డాడు. మొత్తానికి కమెడియన్ గా నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్ళీ తన జీవితాశయాన్ని ఎట్టకేలకు నెరవేర్చుకోవాలనే కసితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఒక కొత్త నిర్మాతను పట్టాడు. ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన జేడీ చక్రవర్తిని హీరోగా పెట్టుకుని శ్రీపద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మాణంలో తన సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు ఆర్పీ.
తన దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ ను కూడా పదిరోజులు చేశాడు. అయితే అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదు అని, దాంతో నిర్మాతకు సినిమా పై నమ్మకం పోయిందని.. జరిగిన పదిరోజుల షూటింగ్ ఫుటేజ్ లో పెద్దగా మ్యాటర్ లేదని.. అందుకే ఇంతటితో సినిమా ఆపేస్తే నష్టపోయేది తక్కువ అని, అల కాకుండా మిగిలిన సినిమా మొత్తం పూర్తి చేయాలంటే మరో ముప్పై రోజులు షూట్ చేయాలని, కాబట్టి ఇంతటితో ఆగిపోతే మంచింది అనే అభిప్రాయానికి నిర్మాత వచ్చాడట.
అయితే హైపర్ ఆది, ధన్ రాజ్ లాంటి కొంతమంది ‘జబర్దస్థ్’ బ్యాచ్ నిర్మాతకు భరోసా ఇస్తున్నారట. ఇక పై అవుట్ ఫుట్ బాగా వస్తోందని.. ఈ సారి కెమెరామెన్ ను మంచి విషయం ఉన్న వ్యక్తిని పెట్టుకుందాం అని, దయచేసి సినిమా ఆపొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి ఆ నిర్మాత వారి మాటలకూ యస్ చెబుతాడో లేదో చూడాలి. మరో పక్క కిరాక్ ఆర్పీ అటు కామెడీకి, ఇటు డైరెక్షన్ కి రెండిటికి కాకుండా పోయాడు పాపం.