
దేశ రాజధాని దిల్లీ వాసులకు అక్కడి కాలుష్య నియంత్రణ కమిటీ ఝలక్ ఇచ్చింది. ఇకపై వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శబ్దకాలుష్యానికి విధించే పెనాల్టీ మొత్తాల్ని సవరించింది. నూతన నిబంధనల ప్రకారం పండగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్ణీత గడువు తర్వాత కూడా టపాసులు పేల్చేవారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు.