
13,14 తేదీల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. నేడు హుజురాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కమలపూర్ మండలం గోపాల్ పూర్ నుంచి తన పాదయాత్ర ఉంటుందన్నారు. ఆ పాదయాత్రలో అన్ని గ్రామాలకు కవర్ చేస్తానన్నారు. భారీ సభ కూడా ఉంటుందన్నారు. 350 నుంచి 400 కిలోమీటర్ల తన పాదయాత్ర ఉంటుందన్నారు. పోల్ మేనేజ్మెంట్ ను పోలీసులు చూసుకుంటున్నారు. మఫ్టీ పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటున్నారన్నారు. కేసీఆర్ ను తిట్టిన వారు ఆయన పక్కన కూర్చున్నారని ఈటల పేర్కొన్నారు.