
ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. పరిధికి మించి రూ. 17,923,94 కోట్ల మేర అప్పులు చేశారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు జూన్ 30న కేంద్రం రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. ఈ లేఖలో రుణాలు, కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందేన్నారు.