
కోళ్ల ఫారాలు నడుపుకునే ఈటలను ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి కేసీఆరే అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా కూడా కేసీఆర్ భరంచారని గుర్తుచేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వ్యక్తి ఈటల రాజేందర్ అని మండిపడ్డారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. తుపాకి రాముడు రేవంత్ రెడ్డని, తోక రాముడు బండి సంజయ్ అని విమర్శించారు.