
విశాఖ జిల్లా నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారంటూ నిన్న టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్రమంగా నిర్మించిన రహదారులను పరిశీలించి నిరసన చేపట్టారు. దీనిపై ఏపీ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. లేటరైట్ తవ్వకాల్లో ప్రస్తుతం ఎలాంటి అక్రమాలు జరగడం లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఆరు లేటరైట్ గనులకు లీజు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అప్రోచ్ రోడ్డు లేక మరో 2 లీజుల్లో పనులు జరగడం లేదు. ప్రస్తుతం ఒక లీజులో 5వేల టన్నులకే అనుమతి ఇచ్చాం. కొన్ని లీజులపై కోర్టు వివాదాలు నడుస్తున్నాయని తెలిపారు.