Karnataka News: జనరల్‌గా గర్ల్స్ హాస్టల్ లో గర్ల్స్ మాత్రమే ఉంటారు. బాయ్స్ హాస్టల్ కూడా అంతే.. అక్కడ బాయ్స్ మాత్రమే ఉంటారు. కానీ, ఇక్కడ మనం తెలుసుకోబోయే ఈ స్టోరిలో బాయ్స్ హాస్టల్లో ఓ గర్ల్ చేరింది. అది కూడా రహస్యంగా కాగా. ఇంతకీ అది ఎలా సాధ్యమైంది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మీరు ఈ స్టోరి కంప్లీట్ గా చదవాల్సిందే.
కర్నాటక స్టేట్‌లోని ఉడిపి డిస్ట్రిక్ట్.. మణిపాల్ లోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్‌లో ఈ ఘటన జరిగింది. బయట ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటే చెడిపోతాడని భయపడ్డ ఓ కుర్రాడి తల్లిదండ్రులు అతడిని కాలేజీలోని హాస్టల్ లో చేర్పించారు. అలా ఆ హాస్టల్ కు వెళ్లాడు కుర్రాడు. అలా ప్రతీ రోజు కాలేజ్ హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలేజ్ హాస్టల్ నుంచి కుర్రాడు ఓ పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లబోయాడు.
Also Read: బాలయ్య సంచలనం.. రాజీనామా సవాల్.. వైసీపీ రెడీనా?
అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. ట్రావెల్ బ్యాగ్ ను పరిశీలిస్తామని అన్నారు. దానికి ఆ కుర్రాడు అస్సలు ఒప్పుకోలేదు. తన బ్యాగ్ తీయొద్దని అన్నాడు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది ట్రావెల్ బ్యాగ్ ఓపెన్ చేసేశారు. అందులో యువతి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. యువకుడు యువతితో బాయ్స్ హాస్టల్ లోనే ఇన్ని రోజుల పాటు హ్యపీగా ఎంజాయ్ చేశాడన్న విషయం అలా బయటపడింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంలో కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. అయితే, ఈ విషయమై కేసు నమోదు అయితే కాలేదని పోలీసులు చెప్తున్నారు. కాలేజీ యాజమాన్యం కాని సెక్యూరిటీ సిబ్బంది కాని కంప్లయింట్ చేయలేదని తెలిపారు.
ట్రావెల్ బ్యాగ్ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని మణిపాల్ పోలీసులు స్పష్టం చేశారు. కాలేజీ బాయ్స్ హాస్టల్ లో ఇటువంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అస్సలు ఆ యువకుడు ఇన్ని రోజుల పాటు కాలేజీ హాస్టల్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బందిని ఎలా మేనేజ్ చేశాడని చర్చించుకుంటున్నారు. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చిన అనుమానం వలన ఈ విషయం బయటపడింది. లేదంటే ఈ విషయం ఇంకా కొన్నాళ్ల పాటు బయటపడే చాన్సెస్ ఉండకపోయేవని అనుకుంటున్నారు.
Also Read: తెలంగాణ బడ్జెట్లో ‘హైలెట్’ అంశం అదేనట?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Karnataka boy tries to sneak girlfriend inside manipal hostel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com