Job Quit: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా స్కిల్ లేని.. అప్‌డేట్‌కాని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు స్కిల్డ్ ఎప్లాయిస్‌ను కూడా భారీ వేతనాల కారణంగా తొలగిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు ఐటీ నిపుణులు మధ్యలోనే జాబ్ మానేసి ప్రకృతి జీవనం వైపు పయనిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి వ్యవసాయం, పాడి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉద్యోగం పోయినా.. పొరపాటున రాజీనామా చేసినా.. మళ్లీ ఉద్యోగం దొరకడం సంక్లిష్టంగా మారింది.
Also Read: ఖరీదైన కారు కొన్న కేజీఎఫ్ స్టార్ యష్.. ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం
తీవ్రమైన పోటీ..
ప్రస్తుత ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో ఉద్యోగ స్థిరత్వం అనేది అత్యంత కీలకమైన అంశం. హైదరాబాద్ వంటి హైటెక్ నగరాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ, పోటీ తీవ్రంగా ఉండడం వల్ల కొత్త ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారింది. ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ కారణం లేకుండా ఉద్యోగం వదిలేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కారణం లేకుండా, తగిన ప్రణాళిక లేకుండా ఉద్యోగం వదిలేస్తే తర్వాత మరో జాబ్ దొరకడం అంత ఈజీ కాదంటున్నారు. ఫ్రెషర్స్ నుంచి అనుభవజ్ఞుల వరకు అందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంది. అందుకే, ఉద్యోగం మానేయాలని నిర్ణయించే ముందు దాని పరిణామాలను కూడా ఆలోచించాలని సూచిస్తున్నారు.
కన్సల్టెన్సీల ఎదుట క్యూ..
ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో పోటీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నిదర్శనం. హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలకు రోజూ వందలాది మంది ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఉద్యోగం వదిలేసినవారు మళ్లీ రెజ్యూమ్‌తో కంపెనీల చుట్టూ తిరగడం, కన్సల్టెన్సీలకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి ఒత్తిడిని పెంచుతుంది. ఈ పోటీలో నిలబడాలంటే అభ్యర్థులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి. తాజాగా హైదరబాద్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సోనీ ఉద్యోగం పోయిందని మానసిక ఒత్తిడికి లోనై రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఘటన చూశాం.
నైపుణ్యం పెంచుకోకుంటే కష్టమే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం కాపాడుకోవడం కూడా ఒక సవాలే. కొత్త ఉద్యోగం దొరికే వరకు ఉన్న ఉద్యోగం వదిలేయొద్దు. ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి, పురోగతి కోసం నైపుణ్యం ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. పోటీకి అనుగుణంగా అప్‌డేట్ కావాలి. ఒకవేల ఉద్యోగం పోతే ఆందోళన చెందకుండా ఆర్థిక స్థిరత్వం కోసం పొదుపు అలవాటు చేసుకోవాలి. సంపాదిస్తున్నామని విచ్చలవిడి ఖర్చులు తగ్గించుకోవాలి.
View this post on Instagram