Mental Health Advice: మానవ శరీరం మెదడు అదుపులో ఉంటుంది. మెదడు ఎలా చెబితే శరీరం అలా ముందుకు సాగుతుంది. మెదడులోని మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. అదే గందరగోళ పరిస్థితులు ఉంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అన్ని సమయాలు ఒకేలా ఉండవు. ఒకసారి ప్రశాంతమైన జీవితం ఉండవచ్చు. మరోసారి అనుకోని పరిస్థితుల వల్ల ఆందోళనగా మారవచ్చు. మనసు బాగా లేనప్పుడు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అయితే కోపం వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కోపంలో అదుపులో ఉంచుకోకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అయితే కోపాన్ని ఎలా అదుపులోకి తీసుకోవచ్చు? అసలు కోపం రావడానికి కారణం ఏంటి?
Also Read: Aurangabad: ప్రియుడి మోజులో.. భర్తపై ఇంత పైశాచికమా? ఔరంగాబాద్ లో మరో దారుణం..
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు.. ఇంట్లో భార్యాభర్తల మధ్య తగువులు.. ఇలా ఎక్కడ చూసినా ఆందోళనకు కారణం కోపమే అవుతుంది. అసలు కోపం రావడానికి కారణమేంటి? అని ఆలోచించేవారు చాలా తక్కువ మంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కోపం తెచ్చుకున్నాడు అంటే అతను అంటే తనకు ఇష్టం లేకుండా ఉండవచ్చు. లేదా తాను చెప్పిన పని చేయకపోయి ఉండవచ్చు. అయితే కోపం తెచ్చుకున్న వారికి ఈ పరిస్థితి అర్థం కావచ్చు.. కానీ కోపంను భరించేవారు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఎదుటివారు మన మీద కోపంగా ఎందుకు ఉన్నారు ముందుగా తెలుసుకోవాలి? ఒకవేళ మనం చేసే పని నచ్చకపోతే వారికి అనుగుణంగా ఆ పని చేసి వారిని శాంత పరచాలి. లేకుంటే ఆ కోపం మరింతగా పెరిగి ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగి సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎదుటివారికి కోపం రావడానికి ఎదుగుదల కూడా కారణం ఉండవచ్చు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నారంటే ఎదుటి వ్యక్తికి నచ్చక తనపై నిత్యం ప్రతి విషయంలో కోపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారు కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు గ్రహించి వారికి అనుగుణంగా మారుతూ ఉండాలి. ఒకవేళ వారు శత్రువులు అయితే వారికి దూరంగా ఉండటమే మంచిది.
కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాలుగా కోపాలు ఉండవచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య కోపం వచ్చినప్పుడు ఎవరో ఒకరు సంయమనం పాటించాలి. లేకుంటే ఈ విషయం పెద్దదిగా మారి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే కోపం తాత్కాలికమైనదే అని గుర్తించాలి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకే ఇద్దరి మధ్య కోపం వస్తుంది. వీటిని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది.
కోపాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి తనకున్న కోపాన్ని బయట పెట్టకుండా సైలెంట్ గా ఉంటూ తాను చేసే పనుల్లో కోపాన్ని ప్రదర్శిస్తాడు. మరొకటి ఒక వ్యక్తి తన కోపాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తాడు. ఇంకో విషయంలో ఒక వ్యక్తికి కోపం ఉన్నప్పుడు సైలెంట్ గా కాకుండా.. దూకుడుగా వ్యవహరించకుండా.. ఎదుటివారికి గుణపాఠం చెప్పే విధంగా ప్రవర్తిస్తాడు. ఎన్ని రకాల కోపాలు ఉన్నా ఆ పరిస్థితుల్లో ఎదుటివారు సంయమనం పాటిస్తేనే ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది.