Central government jobs : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో ఏటా కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ అది హామీగానే మిగిలింది. ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష ఉన్న పదో తరగతి అర్హత కలిగిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), హవల్దార్ పోస్టులకు అవకాశం లభించింది. ఈ ఉద్యోగాలు లెవెల్–1 స్థాయికి చెందినవి. ఇవి మంచి వేతనం, భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదోన్నతుల అవకాశాలను అందిస్తాయి.
Also Read: భోగీల్లోనూ మూడో కన్ను.. రైలు ప్రయాణం మరింత సురక్షితం!
ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) నాన్ టెక్నికల్..
– ఈ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్రీయ సంస్థలలో వివిధ విధులు నిర్వహిస్తారు.
– దేశవ్యాప్తంగా విస్తరించిన కార్యాలయాల్లో సేవలు అందించే అవకాశం.
– సుమారు 4 వేల ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది, వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
హవల్దార్ పోస్టులు..
– కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు.
– పరోక్ష పన్నుల విభాగం, నార్కోటిక్ బ్యూరోలో విధులు.
– తాజా ప్రకటనలో 1.075 ఖాళీలు ఈ విభాగంలోనివి.
వేతనం, ప్రయోజనాలు..
– రూ.18 వేల మూలవేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి భత్యాలతో తొలి నెల నుంచి సుమారు రూ.35 వేల జీతం.
– అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా ఉన్నత స్థాయికి చేరే అవకాశం.
పరీక్ష నమూనా, ఎంపిక విధానం..
– రెండు సెషన్లలో 270 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
– సెషన్–1 (90 మార్కులు, 45 నిమిషాలు)
– న్యూమరికల్ – మ్యాథమెటికల్ ఎబిలిటీ: 20 ప్రశ్నలు (60 మార్కులు).
– రీజనింగ్ ఎబిలిటీ – ప్రాబ్లమ్ సాల్వింగ్: 20 ప్రశ్నలు (60 మార్కులు).
– మైనస్ మార్కులు లేవు.
Also Read : అహ్మదాబాద్ విమానం ఎందుకు కూలిందంటే? కాక్ పిట్ లో మినట్ టు మినట్ జరిగింది ఇదీ
– సెషన్–2 (150 మార్కులు, 45 నిమిషాలు)
– జనరల్ అవేర్నెస్: 25 ప్రశ్నలు (75 మార్కులు).
– ఇంగ్లిష్ లాంగ్వేజ్ – కాంప్రహెన్షన్: 25 ప్రశ్నలు (75 మార్కులు).
– తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు.
అర్హత మార్కులు
– జనరల్: 30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: 25%, ఇతర విభాగాలు: 20%.
– ఎంటీఎస్ పోస్టులకు సెషన్–2 మార్కుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక.
– హవల్దార్ పోస్టులకు సెషన్–2 మెరిట్ ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (హవల్దార్)..
– పురుషులు: 1600 మీటర్ల నడక (15 నిమిషాలు).
– మహిళలు: 1 కిలోమీటరు నడక (20 నిమిషాలు).
– ఫిజికల్ స్టాండర్డ్స్..
– పురుషులు: 157.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 81 సెం.మీ. (5 సెం.మీ. విస్తరణ).
– మహిళలు: 152 సెం.మీ. ఎత్తు, 48 కిలోల బరువు.
అర్హతలు దరఖాస్తు వివరాలు
అర్హత:
– విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
– వయసు (ఆగస్టు 1, 2025 నాటికి):
– ఎంటీఎస్: 18–25 ఏళ్లు (జననం: ఆగస్టు 2, 2000 – ఆగస్టు 1, 2007).
– హవల్దార్ – కొన్ని ఎంటీఎస్ పోస్టులు: 18–27 ఏళ్లు (జననం: ఆగస్టు 2, 1998 – ఆగస్టు 1, 2007).
– వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీ (5 ఏళ్లు), ఓబీసీ (3 ఏళ్లు), దివ్యాంగులు (10 ఏళ్లు).
దరఖాస్తు వివరాలు:
– ఆన్‌లైన్∙దరఖాస్తు గడువు: జూలై 24, 2025.
– ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు).
– పరీక్ష తేదీలు: సెప్టెంబరు 20 – అక్టోబరు 24, 2025.
– వెబ్‌సైట్: ssc.gov.in, (https://ssc.gov.in).