Suriya Venky movie title: సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో దశాబ్దం కి పైగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో ఎవరు అని అడిగితే, మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూర్య(Surya Sivakumar). ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలైన ‘కంగువ’, ‘రెట్రో’ లపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. కానీ ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అసలే వరుస ఫ్లాప్స్ తో సూర్య మార్కెట్ డౌన్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల ఫ్లాప్స్ తో ఇంకా డౌన్ అయిపోయింది. మన తెలుగు లో సూర్య కి ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాప్స్ కారణంగా ఇక్కడ కూడా మార్కెట్ చెడిపోయింది. ఇదంతా పక్కన పెడితే సూర్య మొట్టమొదటి సారి మన టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. టైటిల్ చూస్తుంటే ఈ చిత్రం కూడా ‘లక్కీ భాస్కర్’ లాగా ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తోంది. కానీ ఆ టైటిల్ ని చూసి కొంతమంది బాగుందని అంటున్నారు, మరికొంత మంది ఇదేమి టైటిల్ బాబోయ్..సూర్య ఏమి మారలేదు. ఈ సినిమా కూడా పోయినట్టే అని కామెంట్ చేస్తున్నారు.. కానీ ‘లక్కీ భాస్కర్’ టైటిల్ ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ చిత్రానికి వచ్చిన ఫలితం ఎలాంటిదో మనమంతా చూసాము.
ఈ సినిమాకు కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తోంది . ఇదంతా పక్కన పెడితే నాగవంశీ నిర్మాతగా వ్యవహరించే ప్రతీ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్ ఉంటుంది. ‘విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ ని చూస్తుంటే, ఇది కచ్చితంగా త్రివిక్రమ్ సూచించిన టైటిల్ లాగానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్స్ ఎంత విచిత్రంగా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కూడా అలాంటి విచిత్రమైన టైటిల్ ఉంది కాబట్టి, కచ్చితంగా త్రివిక్రమే ఈ టైటిల్ ని సూచించి ఉంటాడని అంటున్నారు.