https://oktelugu.com/

మళ్లీ ఎన్నికల ప్రచారానికి ట్రంప్‌..!

కరోనా బారిన పడ్డ ట్రంప్‌ పూర్తిగా కోలుకున్నట్లు వైట్‌హౌజ్‌ వైద్యుడు సియాన్‌ కాన్లే వెల్లడించారు. గత శుక్రవారం కరోనా బారిన బడ్డ ట్రంప్‌ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత వైట్‌హౌజ్‌లోనే చికిత్స పొందుతూ వస్తున్నారు. తాజాగా ఆయన పూర్తిగా కోలుకున్నారని, త్వరలో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తారని ట్రంప్‌ వైద్యుడు సియాన్‌ తెలిపారు. వైట్‌హౌజ్‌లో చికిత్స పొందుతున్న రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌ను టార్గెట్‌ చేస్తూ […]

Written By: , Updated On : October 10, 2020 / 10:08 AM IST
Follow us on

కరోనా బారిన పడ్డ ట్రంప్‌ పూర్తిగా కోలుకున్నట్లు వైట్‌హౌజ్‌ వైద్యుడు సియాన్‌ కాన్లే వెల్లడించారు. గత శుక్రవారం కరోనా బారిన బడ్డ ట్రంప్‌ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత వైట్‌హౌజ్‌లోనే చికిత్స పొందుతూ వస్తున్నారు. తాజాగా ఆయన పూర్తిగా కోలుకున్నారని, త్వరలో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తారని ట్రంప్‌ వైద్యుడు సియాన్‌ తెలిపారు. వైట్‌హౌజ్‌లో చికిత్స పొందుతున్న రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. కమలా అధికారంలోకి వస్తే కమ్యూనిస్టుగా మారుతుందని ట్రంప్‌ ఆరోపించారు.