టీడీపీ వలసలపై చంద్రబాబు ఆలోచన ఇదీ!

2018 ఎన్నికల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి జాతకం బాగుండడం లేదు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడమే కాకుండా ముఖ్య నాయకులు టీడీపీ నుంచి వైసీపీ, బీజేపీల్లోకి చేరారు. అయితే ఉన్నవారికి కాపాడుకొని, వచ్చేవారిని చేర్చుకుంటూ వచ్చే ఎన్నికల వరకైనా పార్టీని బలోపేతం చేయాలని ఎంతో కృషి చేస్తున్నారు. కానీ బాబుకు సన్నిహితంగా ఉండేవారు సైతం ఆయనను విడిచిపెట్టడంతో తీవ్రంగా కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తాజగా విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి జాయిన్‌ […]

Written By: NARESH, Updated On : October 10, 2020 10:37 am
Follow us on

2018 ఎన్నికల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి జాతకం బాగుండడం లేదు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడమే కాకుండా ముఖ్య నాయకులు టీడీపీ నుంచి వైసీపీ, బీజేపీల్లోకి చేరారు. అయితే ఉన్నవారికి కాపాడుకొని, వచ్చేవారిని చేర్చుకుంటూ వచ్చే ఎన్నికల వరకైనా పార్టీని బలోపేతం చేయాలని ఎంతో కృషి చేస్తున్నారు. కానీ బాబుకు సన్నిహితంగా ఉండేవారు సైతం ఆయనను విడిచిపెట్టడంతో తీవ్రంగా కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తాజగా విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి జాయిన్‌ అవుతున్నాడని తెలుస్తుండడంతో అత్యంత సన్నిహితుల వద్ద ‘పోతే పోనీ.. ముందుంది మంచికాలం’ అని సర్దుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..?

బాబు మీద నమ్మకం ఉంది కావచ్చు.. కానీ తప్పని పరిస్థితుల్లో వైసీపీలో చేరక తప్పడం లేదు.. అంటూ ఇదివరకే కొందరు టీడీపీని వీడిన నాయకులు వాపోయారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను మరిచి టీడీపీని కుంగదీయాలనే లక్ష్యం పెట్టుకోవడంతో పాటు ఆ పార్టీలోని నాయకులను బాబును వీడేలా ప్లాన్‌ చేస్తోందని సైకిల్‌ శ్రేణులు అంటున్నారు. కేసులు, రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకనే కొందరు సైకిల్‌ని వదులుకుంటున్నట్లు టీడీపీ వర్గం ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడి లాంటి వారు బాబును పట్టుకొని ఉన్నా.. వైసీపీ కేసుల బాణంతో గురిపెట్టిందని ఆవేదన చెందుతున్నారు.

అయితే బాబు మాత్రం వలసలపై ఏమాత్రం భయపడడం లేదట. తనకు రాజకీయం కొత్తేమీ కాదని, ఇలాంటి రాజకీయాలను ఎన్నో చూశానని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారట. ముఖ్యనాయకులు పార్టీని వీడినా కొత్త నాయకులతో పార్టీ ఉత్సాహంగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారట. అంతేకాకుండా వచ్చే ఎన్నికల వరకు టీడీపీని బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని చెప్పుకొచ్చాడట.

Also Read: చంద్రబాబును జైలుకు పంపే వరకు వదలనంటున్న ఎన్టీఆర్ సతీమణి..?

మరోవైపు వైసీపీలో క్యాడర్‌ ఓవర్‌లోడ్‌ కావడంతో అసంతృప్తులు.. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నారు బాబు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో జగన్‌పై వస్తున్న వ్యతిరేకత, కోర్టు మొట్టికాయలను ప్రజలకు వివరించనున్నాడట. అంతేకాకుండా అప్పులు చేసీ మరీ సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతున్నాడని దీంతో రాబోయే కాలంలో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారే అవకాశముందనే వాదనతో ఎన్నికల్లో దిగేందుకు ప్లాన్‌ వేస్తున్నాడట టీడీపీ అధినేత.