
ట్రంప్ తనకు శత్రువు కాదని, సరికొత్త నిర్మాణంలో ట్రంప్ కూడా కలిసి రావాలని అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బైడెన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే తరుణంలో ఆయన ప్రజలను ఆట్టుకునే ప్రసంగం చేశారు. ప్రజలు ఆశించిన పాలన అందిస్తామన్నారు. ఈ గెలుపు అమెరికన్లదని, వారి కోసమే పనిచేస్తానన్నారు. 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమొక్రట్లాకు ఓటేశారని, పూర్తి ఆధిక్యతో విజయం సాధించానన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు. కరోనా సంమయంలోనూ పార్టీ కోసంపనిచేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలని చెప్పారు.