https://oktelugu.com/

మిస్సింగ్ కేసు: సౌమ్య మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లాలో మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మత్తమాలలో అదృశ్యమైన రెండెళ్ల పాప మృతదేహం బుధవారం లభ్యమైంది. గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కూతురు సౌమ్య మంగళవారం ఇంటిముందట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టు పక్కలా వెతికినా కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మంగళవారం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలతో రంగంలోకి దిగారు. అయినా ఆచూకీ లభించలేదు. అయితే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 4, 2020 / 12:06 PM IST
    Follow us on

    కామారెడ్డి జిల్లాలో మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మత్తమాలలో అదృశ్యమైన రెండెళ్ల పాప మృతదేహం బుధవారం లభ్యమైంది. గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కూతురు సౌమ్య మంగళవారం ఇంటిముందట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టు పక్కలా వెతికినా కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మంగళవారం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలతో రంగంలోకి దిగారు. అయినా ఆచూకీ లభించలేదు. అయితే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో కొందరు స్థానికులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మృతిపై అనుమానాలున్నందున అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.