వ్యాక్సిన్ తీసుకొని మీడియాతో మాట్లాడుతూ కుప్పకూలింది..!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెడ్ నర్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో కుప్పకూలిపోయింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో టెన్నెస్సీలో ఓ హెడ్ నర్సు టిపానీ డోవార్ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అనంతరం ఆమె తాను వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మీడియాతో మాట్లాడుతుండగానే.. నాకేదో అవుతోందని చెప్పింది. దీంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలింది. […]

Written By: Suresh, Updated On : December 19, 2020 2:54 pm
Follow us on

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెడ్ నర్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో కుప్పకూలిపోయింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో టెన్నెస్సీలో ఓ హెడ్ నర్సు టిపానీ డోవార్ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అనంతరం ఆమె తాను వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మీడియాతో మాట్లాడుతుండగానే.. నాకేదో అవుతోందని చెప్పింది. దీంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలింది. అయితే అప్రమత్తమైన స్థానిక వైద్య సిబ్బంది ఆమెకు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

https://twitter.com/ASB_Breaking/status/1339979767160967173?s=20