https://oktelugu.com/

యాంకర్ ప్రదీప్ సంపాదన అంతా… హీరోలను దాటేశాడుగా!

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలిగిపోతున్నాడు ప్రదీప్. ఫిమేల్ యాంకర్స్ లో సుమ, మేల్ యాంకర్స్ లో ప్రదీప్ అన్నట్లు ఉంది పరిస్థితి. గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ ప్రోగ్రామ్స్ అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం లెక్కకు మించి బుల్లితెర షోలు అతని చేతిలో ఉన్నాయి. మరో వైపు 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో హీరోగా కూడా మారనున్నాడు. ఈ చిత్రంలోని సాంగ్స్ యూత్ కి బాగా […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 02:44 PM IST
    Follow us on


    బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలిగిపోతున్నాడు ప్రదీప్. ఫిమేల్ యాంకర్స్ లో సుమ, మేల్ యాంకర్స్ లో ప్రదీప్ అన్నట్లు ఉంది పరిస్థితి. గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ ప్రోగ్రామ్స్ అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం లెక్కకు మించి బుల్లితెర షోలు అతని చేతిలో ఉన్నాయి. మరో వైపు 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో హీరోగా కూడా మారనున్నాడు. ఈ చిత్రంలోని సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ కాగా మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈవెంట్స్, ప్రోగామ్స్, సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రదీప్ సంపాదన ఎంత ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొనగా, కొన్ని షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి.

    Also Read: సినీ ఇండస్ట్రీకి జగన్‌ చేయూత

    ప్రదీప్ నెల సరి సంపాదన దాదాపు రూ. 50లక్షలకు పైమాటేనట. బుల్లితెర షోలు మరియు ఈవెంట్స్ ద్వారా ఈ మొత్తం ఆయన ఆర్జిస్తున్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితమే ప్రదీప్ నెలకు రూ. 30లక్షలకు పైగా సంపాదిస్తున్నారట. ప్రస్తుతం అది అర కోటిని దాటిందని వినికిడి. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రానికి గాను ఆయన రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క ఢీ షో కోసం ఎపిసోడ్ కి ప్రదీప్ రూ. 1.25 లక్షలు తీసుకుంటున్నారట. గతంలో ఎపిసోడ్ కి రూ. 75వేలు తీసుకొనే ప్రదీప్ దానిని పెంచేశాడట. ఈ స్థాయిలో సంపాదన అంటే మాములు విషయం కాదు.

    Also Read: పెళ్లెప్పుడంటే… కొట్టేస్తా అంటున్న సింగర్ సునీత

    ఓ స్థాయి హీరో సంపాదన కూడా ఏడాదికి రూ. 5-6 కోట్లు దాటడం లేదు. అలాంటిది ప్రదీప్ యాంకర్ గా రూ. 6కోట్లు సంపాదిస్తూ హీరోలకంటే తానే గ్రేట్ అని నిరూపిస్తున్నాడు. బుల్లితెరపై తిరుగులేని ఫేమ్ సంపాదించిన ప్రదీప్ వెండితెరపై కూడా సత్తా చాటుతాడేమో చూడాలి. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రదీప్ హీరోగా బిజీ కావడం ఖాయం. ఇక ఈ స్టార్ యాంకర్ లైఫ్ లో అనేక వివాదాలలో చిక్కుకున్నాడు. ఒకసారి తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. అలాగే అనేకమార్లు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రదీప్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్