సీఎం జగన్ కు సినీ ప్రముఖుల ప్రశంసల వెల్లువ !

కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అయిపోయింది. ప్రజా రక్షణార్థం మోదీ ప్రభుత్వం దేశం మొత్తం కొన్నాళ్ల పాటు లాక్ డౌన్ అమలు చేయడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు ఎంతో కొంత నష్టం చవి చూశాయి. ఆ కోవలోనే చిత్ర పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. సినిమా షూటింగ్స్ లేక, రిలీజ్ లు లేక సినిమా మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ తిరిగి గాడిన పడింది. […]

Written By: admin, Updated On : December 19, 2020 2:56 pm
Follow us on


కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అయిపోయింది. ప్రజా రక్షణార్థం మోదీ ప్రభుత్వం దేశం మొత్తం కొన్నాళ్ల పాటు లాక్ డౌన్ అమలు చేయడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు ఎంతో కొంత నష్టం చవి చూశాయి. ఆ కోవలోనే చిత్ర పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. సినిమా షూటింగ్స్ లేక, రిలీజ్ లు లేక సినిమా మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ తిరిగి గాడిన పడింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుండి సపోర్ట్ ఉంటే తొందరగా కోలుకోవటానికి అవకాశాము ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ ఆద్వర్యంలోని ఏపీ కేబినెట్ 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు నిర్ణయం తీసుకుంది.

Also Read: యాంకర్ ప్రదీప్ సంపాదన అంతా… హీరోలను దాటేశాడుగా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన స‌హ‌కారానికి సినిమా ఇండ‌స్ట్రీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తోంది. ఈ సంద‌ర్భంగా.. మాజీ ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు, నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్ ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌గారు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిల‌బ‌డుతూ చేసిన సాయం వెల‌క‌ట్ట‌లేనిది. ఈ విష‌యంలో స‌హ‌క‌రించిన సినిమా పెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవిగారికి, అక్కినేని నాగార్జున‌గారికి, డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళిగారు, త్రివిక్ర‌మ్‌గారు ఇత‌ర సినీ పెద్ద‌లరంద‌రికీ మరియు ప్ర‌భుత్వానికి సినీ పరిశ్ర‌మ ఎగ్జిబిట‌ర్స్ త‌ర‌పున కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం అని అన్నారు.

Also Read: పెళ్లెప్పుడంటే… కొట్టేస్తా అంటున్న సింగర్ సునీత

జగన్ ప్రభుత్వం మీద ప్రశంసల వెల్లువ అంతటితో ఆగిపోలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ , రాష్ట్ర ప్రభుత్యానికి అభినందనలు తెలియచేసారు. చిరంజీవి ట్విటర్‌లో ‘ఎగ్జిబిటర్స్‌ కోసం సినిమా రిసార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. ఇంకా కొంత మంది సినిమా ప్రముఖులు ఏపీ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియచేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్