మిత్రపక్షం ఉపసంహరణతో కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున రద్దయింది. మిత్రపక్షం ‘బ్లూ అండ్ వైట్ ’ పార్టీ  మద్దతు ఉపసంహరించుకోవడంతో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయింది. గడువులోగా బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో మిత్ర పక్షం దూరమైంది. దీంతో అధికారం చేపట్టిన 8 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం. 7 నెలల కిందే బెంజిమిన్ నెతన్యాహు, జెన్నీ గట్జ్ మధ్య జరిగిన ఒప్పందంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  ప్రభుత్వ ఏర్పాటుకు గత రెండేళ్లలో ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. కరోనా […]

Written By: Suresh, Updated On : December 23, 2020 9:09 am
Follow us on

ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున రద్దయింది. మిత్రపక్షం ‘బ్లూ అండ్ వైట్ ’ పార్టీ  మద్దతు ఉపసంహరించుకోవడంతో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయింది. గడువులోగా బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో మిత్ర పక్షం దూరమైంది. దీంతో అధికారం చేపట్టిన 8 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం. 7 నెలల కిందే బెంజిమిన్ నెతన్యాహు, జెన్నీ గట్జ్ మధ్య జరిగిన ఒప్పందంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  ప్రభుత్వ ఏర్పాటుకు గత రెండేళ్లలో ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. కరోనా మహమ్మారిపై పోరు చేయడానికి వ్యక్తిగత శత్రుత్వాన్ని పక్కనబెట్టి ‘లైకుడ్ పార్టీ’, బ్లూ అండ్ వైట్ పార్టీలు కలిసి ప్రతిష్టంభనతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  కొన్ని నిబంధనలతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ లిబరల్ మూవ్ మెంట్ గా పేరున్న లైకుడ్ పార్టీకి బెంజమిన్ నెతన్యాహు సారథ్యాన్ని వహిస్తున్నారు. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బ్లూ అండ్ వైట్ పార్టీకి బెన్నీ గాంట్జ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అధికారాన్ని చెరిసగం పంచుకోవాలని వీరు ఒప్పందం చేసుకున్నారు. తొలి 18 నెలలు నెతన్యాహు, చివరి 18 నెలల గాంట్జ్ ప్రధాని గా ఉండాలని ఒప్పందం అయితే సరైన సమయానికి ప్రధాని నెతన్యాహు బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో బ్లూ అండ్ వైట్ పార్టీ మద్దతు ఉప సంహరించుకుంది. దీంతో బుధవారం ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.